Advertisementt

ఈ వారం ఇంట్రస్టింగ్ గా ఉందే..

Mon 23rd Aug 2021 11:11 AM
sridevi soda centre movie,august last week movie,ichata vahanamulu nilaparadu movie  ఈ వారం ఇంట్రస్టింగ్ గా ఉందే..
Upcoming movies in theaters, last week of August ఈ వారం ఇంట్రస్టింగ్ గా ఉందే..
Advertisement
Ads by CJ

సెకండ్ వెవ్ పోయింది.. థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.. పొలోమంటూ సినిమాలు థియేటర్స్ కి వచ్చేస్తున్నాయి. అందులో ఒకటో రెండో ఇంట్రెస్టింగ్ కలిగించే సినిమాలు తప్ప.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాలు చాలా తక్కువ. గత వారం శ్రీ విష్ణు రాజా రాజా చోర మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా అద్భుతమైన హిట్ కొట్టగా.. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లోనూ కాస్త ఇంట్రెస్ట్ కలిగించే సినిమాలు కనిపిస్తున్నాయి. అందులో సుశాంత్ ఇచట వాహనాములు నిలపరాదు సినిమా వచ్చే శుక్రవారం అంటే ఆగష్టు 27 న రిలీజ్ కి రెడీ అయ్యింది. చి ల సౌ తో హిట్ కొట్టిన సుశాంత్ ఇచట వాహనములు నిలపరాదు సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. 

ఇక నెక్స్ట్ మహేష్ బావగారు సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కూడా ఆగష్టు 27 నే రిలీజ్ అవ్వబోతుంది. వి సినిమాతో అదరగొట్టేసిన సుధీర్ బాబు.. ఆనంది కీలక పాత్రల్లో కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలున్నాయి. శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్‌ కలిసి నటించిన చిత్రం హౌజ్‌ అరెస్ట్‌ కూడా ఆగష్టు 27 నే రిలీజ్ అవ్వబోతుంది. ఇక వీటితో పాటుగా కమెడియన్ సత్య కీలక పాత్రలో నటించిన వివాహ భోజనంబు సినిమా సోని లివ్ ఓటిటి నుండి రిలీజ్ ఆగష్టు 27 నే రిలీజ్ అవుతుంది. మరోపక్క ఇతర భాషల సినిమాలు కూడా ఆగష్టు 27 నే రెడీ టు రిలీజ్ అంటున్నాయి. 

Upcoming movies in theaters, last week of August:

August last week movies list 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ