ఈ రోజు మెగాస్టార్ బర్త్ డే.. సోషల్ మీడియా మొత్తం మెగాస్టార్ చిరు న్యూస్ లే. ఆయనకి విషెస్ చెప్పడానికి పోటీ పడే ప్రముఖులతో హంగామా మాములుగా లేదు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు అంతా చిరుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడ్డారు. మెగాస్టార్ అంటే ఇండస్ట్రీ పెద్ద కాబట్టి ఆయన్ని గౌరవించేవాళ్ళు, ఆయన్ని సన్మానించేవాళ్ళు బోలెడంతమంది.. ఆయన్ని కలవడానికి పోటీ పడ్డారు. ఇక మద్యాన్నం వరకు అభిమానులకి, ప్రముఖులకి టైం కేటాయించిన మెగాస్టార్ చిరు.. ఆ తర్వాత ఫ్యామిలీకి టైం కేటాయించారు.
ఫ్యామిలీ తో చిన్నపాటి పార్టీ చేసుకున్న మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ - కోడలు ఉపాసనలతో టైం స్పెండ్ చేసారు. కొడుకు, కోడలు తో మెగాస్టార్ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొడుకు కోడలు మధ్యలో చిరు.. పిక్ అదిరింది.. మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్ లో, ఆయన మూవీ అప్ డేట్స్ లో ఈ పిక్ వెరీ వెరీ స్పెషల్ అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.