Advertisementt

చిరంజీవికి చంద్ర‌బాబు బ‌ర్త్ డే విషెస్

Sun 22nd Aug 2021 04:14 PM
chandra babu,megastar chiranjeevi,tdp leader chandrababu,chiranjeevi,chiru birthday  చిరంజీవికి చంద్ర‌బాబు బ‌ర్త్ డే విషెస్
Chandra Babu wishes to Chiranjeevi చిరంజీవికి చంద్ర‌బాబు బ‌ర్త్ డే విషెస్
Advertisement
Ads by CJ

నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల నుంచి బెస్ట్ విషెస్ వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియ‌జేసిన‌ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కి మెగాస్టార్  చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసారు.

చంద్రబాబు నాయుడు స్వ‌యంగా ఫోన్ లో చిరంజీవికి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఈ క‌రోనా క్లిష్ట స‌మ‌యంలో మీరు చేస్తున్న సేవాకార్య‌క్ర‌మాలు ఎంతో బావున్నాయి. స‌మాజానికి అలాగే ప‌రిశ్ర‌మ‌లో సినీకార్మికుల‌కు ఉప‌యోగ‌ప‌డేలా మీరు చేస్తున్న సేవాకార్య‌క్ర‌మాలు గ‌మ‌నిస్తున్నాను. చాలా మంచి కార్య‌క్ర‌మాలు చేస్తూ సేవాధృక్ప‌థంతో ఉన్న మీకు నా శుభాభినంద‌న‌లు అని తెలిపారు. 

సినీప‌రిశ్ర‌మ‌లోనూ గ‌త వైభ‌వాన్ని గుర్తు తెచ్చేలా మీరు రాణిస్తున్న విధానం... ఎంతో ఇష్టంతో క‌ష్ట‌ప‌డుతున్న సినిమాల్లో రాణించాల‌ని మీ లెగ‌సీ ఇలాగే కొన‌సాగాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుతున్నాను అని చిరంజీవి న‌ట‌నారంగంలో కృషిపైనా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి  తన సంతోషాన్ని కృతజ్ఞతలని తెలియచేసారు.

Chandra Babu wishes to Chiranjeevi:

Chandra Babu wishes to Megastar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ