ఈ రోజు మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు. బాస్ బర్త్ డే అంటే ఫాన్స్ ఆగుతారా.. చిరు కి విషెస్ చెబుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మెగా రక్తదానాలు, కేక్ కటింగ్స్, చిన్న సినిమాల లుక్స్ అన్ని అంతా హడావిడే. ఇక మెగాస్టార్ బర్త్ డే ఫాన్స్ కి వెరీ స్పెషల్ బర్త్ డే.. ఎందుకంటే ఈ బర్త్ డే చిరు నటించబోతున్న లుక్స్, టైటిల్ తో హంగామా చేస్తున్నారు కాబట్టి. మెగాస్టార్ ప్రస్తుతం నాలుగు మూవీస్ ని లైన్ లో పెట్టగా అందులో ఆచార్య షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇక మలయాళ లూసిఫర్ రీమేక్ సెట్స్ మీదుంది. మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చేస్తున్న లూసిఫెర్ రీమేక్ కి గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టి మోషన్ పోస్టర్ గా చిరు పుట్టిన రోజు స్పెషల్ గా విడుదల చేసారు.
ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ టైటిల్ కూడా చిరు పుట్టిన రోజు నాడు రివీల్ చేసేసారు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా చిరు 154 టైటిల్ ని రివీల్ చేసారు. మెహర్ దర్శకత్వం చిరు భోళా శంకర్ గా రాబోతున్నాడు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించే ఈ సినిమాలో చిరుకి సోదరిగా కీర్తి సురేశ్ కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం చిరు 154 టైటిల్ పోస్టర్ భోళా శంకర్ టైటిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇక మిగిలింది.. బాబీ దర్శకత్వంలో చిరు చెయ్యబోతున్న మూవీ అప్ డేట్ రావాల్సి ఉంది.
మరి బాబీ అప్ డేట్ చిరు బర్త్ డే స్పెషల్ గా ఈ రోజు సాయంత్రం రివీల్ చెయ్యబోతున్నారు. సో చిరు బర్త్ డే కి ఆయన సినిమాల టైటిల్స్ తో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.