ఫైనల్లీ పుష్ప సెట్స్ లో ఫహద్
Finally Fahadh Faasil joins the sets of Pushpaకరోనా సెకండ్ వెవ్ వలన సినిమా షూటింగ్స్ కి అంతరాయం కలిగినట్టే.. అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప సినిమా షూటింగ్ కూడా ఆగింది. అల్లు అర్జున్ కి కరోనా సోకడంతో.. సుకుమార్ పుష్ప షూటింగ్స్ వాయిదా వేశారు. ఇక విలన్ పాత్రధారి ఫహద్ ఫాజిల్ పై పుష్ప లోని కీలక సన్నివేశాలు తెరకెక్కిద్దామని అనుకున్నా.. సెకండ్ వేవ్ ఉధృతి వలన ఫహద్ ఫాజిల్ హైదరాబాద్ నుండి వెళ్లిపోవడంతో షూటింగ్ ఆగింది. ఇక గత నెలలో హైదరాబాద్ లోనే పుష్ప షూటింగ్ మొదలయ్యింది. దానితో ఫహద్ హైదరాబాద్ కి వచ్చారు. కాని షూటింగ్ లో పాల్గొనలేదు. సుక్కు తో అల్లు అర్జున్ తో సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి బాగా ఎగ్జైట్ అయ్యారు ఫహద్. ఇక ఫహద్ ఫాజిల్ పుష్ప షూటింగ్ లో పాల్గొంటారనుకున్న సమయంలో పుష్ప యూనిట్ లో చాలామంది డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో షూటింగ్ మళ్ళీ ఆగింది.
ఎప్పుడెప్పుడు పుష్ప షూటింగ్ లో జాయిన్ అవుదామని ఫహద్ ఫాజిల్ ఎదురు చూసిన కొద్దీ అది వెనక్కి వెళ్ళింది. ఇక అల్లు అర్జున్ ఫాన్స్ కూడా ఎప్పుడెప్పుడు ఫహద్ - అల్లు అర్జున్ కలిసి ఫైట్ చేస్తారా అని ఎదురు చూస్తూన్నారు. ఫైనల్లీ ఫహద్ ఫాజిల్ ఈ రోజు నుండే పుష్ప పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొన్నట్టుగా పుష్ప టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఫహద్ ని సాదరంగా ఆహ్వానించినట్టుగా పోస్టర్ తో సహా ప్రకటన ఇచ్చింది. సో అఫీషియల్లి ఫహద్ ఫాజిల్ నేడు పుష్ప సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఇక మరోపక్క ఫహద్ ఫాజిల్ 7th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఆయన వైఫ్ నజ్రియా.. భర్త ఫహద్ కి రాసిన ఓ స్వీట్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Fahadh Faasil joins the sets of Allu Arjun Pushpa






































