Advertisementt

పోటీకి వెళ్లి లాస్ అవడం కరెక్టా ..?

Sat 21st Aug 2021 06:46 PM
love story movie,tuck jagadessh movie,nani vs naga chaitanya,love story release date changed  పోటీకి వెళ్లి లాస్ అవడం కరెక్టా ..?
Is it correct to go to a competition and lose? పోటీకి వెళ్లి లాస్ అవడం కరెక్టా ..?
Advertisement
Ads by CJ

సెకండ్ వెవ్ తగ్గడం, థియేటర్స్ ఓపెన్ అవడం, సినిమాలు వరసగా రిలీజ్ బాట పట్టడంతో.. కాస్త బాక్సాఫీసు గలగలలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైం లో మీడియం బడ్జెట్ మూవీస్ కూడా రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అందులో మొదటగా నాగ చైతన్య లవ్ స్టోరీ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముందు వచ్చారు. సెప్టెంబర్ 10 వినాయక చవితి స్పెషల్ గా లవ్ స్టోరీ ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు లవ్ స్టోరీ కి పోటీగా వినాయక చవితి స్పెషల్ గా మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయితే ఓకె... కానీ లవ్ స్టోరీ మీద పోటీకి మీడియం బడ్జెట్ మూవీస్ ఓటిటి నుండి రిలీజ్ అవుతున్నాయి.

అందులో నాని టక్ జగదీశ్  అమెజాన్ ప్రైమ్ ఓటిటి నుండి సెప్టెంబర్ 10 న రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అలాగే నితిన్ మ్యాస్ట్రో కూడా సెప్టెంబర్ 10 వినాయకచవితి స్పెషల్ గా హాట్ స్టార్ ఓటిటి నుండి రిలీజ్ కి రెడీ అవుతుంది. లవ్ స్టోరీ మేకర్స్ మొత్తుకుంటున్నా.. టక్ జగదీశ్, మ్యాస్ట్రో మూవీస్ మేకర్స్ తగ్గడం లేదు. అయితే ఏపీలో ఇంకా థియేటర్స్ సమస్యలు కొలిక్కి రాని టైం లో లవ్ స్టోరీ మేకర్స్ సాహసం చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారు.. కానీ ఇప్పుడు అదే రోజు ఓటిటి నుండి సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఇంట్లో హాయిగా కూర్చుని సినిమాలు చూస్తూ థియేటర్స్ కి ఎవరు వస్తారు. అసలు లవ్ స్టోరీ ఆగి ఆగి ఇప్పుడు పోటీకి దిగడం కరెక్ట్ ఆ అంటున్నారు చైతు అభిమానులు. 

Is it correct to go to a competition and lose?:

Love story release date changed?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ