Advertisementt

ఒకరికి తెలియకుండా మరొకరు శ్రీవారి సేవలో

Sat 21st Aug 2021 04:52 PM
manchu manoj,manchu lakshmi at tirupati,manchu manoj and lakshmi at tirupati  ఒకరికి తెలియకుండా మరొకరు శ్రీవారి సేవలో
Manchu Manoj, Lakshmi at Tirupati Balaji Temple ఒకరికి తెలియకుండా మరొకరు శ్రీవారి సేవలో
Advertisement
Ads by CJ

మంచు మోహన్ బాబు కూతురు లక్ష్మి, మంచు మనోజ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంచు మనోజ్‌ మీడియాతో మాట్లాడారు. పండుగ సందర్భంగా తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. అంతేగాక లక్ష్మీ, తాను అనుకోకుండా ఇక్కడికి వచ్చామ​న్నారు. ఇద్దరూ వేరువేరుగా ప్లాన్‌ చేసుకుని అనుకోకుండా ఇక్కడ కలిశామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో అంట్లడుతున్న మనోజ్ తన సినిమాలపై స్పందిస్తూ ప్రస్తుతం తాను అహం బ్రహ్మాస్మ’ మూవీ చేస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే దీనిపై అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు కూడా తెలిపాడు. ఇక తాను కొత్తగా ఓ బిజినెస్‌ మొదలు పెట్టబోతున్నట్లు కూడా వెల్లడించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేందుకు కొత్త ఓ వెంచర్‌ను మొదలు పెట్టబోతున్నానని పేర్కొన్నారు. తిరుపతిలో మంచు అక్కా, తమ్ముళ్ల సందడి ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Manchu Manoj, Lakshmi at Tirupati Balaji Temple:

Manchu Manoj, Lakshmi at Tirupati

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ