ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అవడము.. బోలెడన్ని సినిమాలు రిలీజ్ అవడం, అందులో చిన్న, మీడియం బడ్జెట్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇక భారీ బడ్జెట్ మూవీస్ రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మేకర్స్, ఆచార్య, అఖండ, ఖిలాడీ ఇలాంటి మూవీస్ అన్ని రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి సిద్దమవుతున్న వేళ హీరో నాని నటించిన టక్ జగదీశ్ ని ఓటిటి కి అమ్మెయ్యడం, అందులోనూ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న లవ్ స్టోరీ కి పోటీగా సెప్టెంబర్ 10 నే రిలీజ్ చెయ్యడం పై లవ్ స్టోరీ మేకర్స్ ఫైర్ అవుతున్నారు.
టక్ జగదీశ్ ని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యకుండా ఓటిటి లో రిలీజ్ చేస్తూ.. థియేటర్స్ వ్యవస్థని కించ పరుస్తున్నారని, అలాగే మరో సినిమాకి పోటీగా ఓటిటి నుండి రిలీజ్ చెయ్యడం పై ఫైర్ అవుతూ ప్రెస్ మీట్స్ పెడుతూ అమెజాన్ ప్రైమ్ వారిని వార్న్ చేస్తున్నారు. ప్రస్తుతం హీరో నాని ఫాన్స్ టక్ జగదీశ్ రిలీజ్ పై ఎగ్జైట్ అవుతుంటే.. మిగతా ఫాన్స్ మాత్రం నాని పై ఫైర్ అవుతున్నారు. నాని సినిమా థియేటర్స్ లో రిలీజ్ చెయ్యకుండా మిగతా వారిని ఇబ్బంది పెడుతున్నారంటున్నారు. నాని మాత్రం నాదేం ఉంది.. అంతా టక్ జగదీశ్ మేకర్స్ నిర్ణయమే ఫైనల్ అంటూ చేతుల్లేసిన విషయం తెలిసిందే.