టోక్యో ఒలింపిక్స్ బ్యాట్మెంటన్ పతాక విజేత పివి సింధు.. ఇండియాలో అడుగుపెట్టినప్పటినుండి రాజకీయనాయకులు, మంత్రులు, సినిమా సెలబ్రిటీస్ సత్కారాలతో తడిచి ముద్దవుతుంది. అలాగే గుళ్ళు గోపురాలు తిరుగుతూ బిజీ బిజీగా గడుపుతున్న సింధు ని మెగాస్టార్ చిరు సత్కరించడం హాట్ టాపిక్ గా మారింది. చిరు పివి సింధు ని సత్కరించిన ఫొటోస్ ని మరో సీనియర్ నటి రాధికా సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ ఫొటోస్ చూసిన వారు చిరు ఇంట్లో సైలెంట్ గా పివి సింధు కి అతిధి సత్కారాలు అందిచారంటున్నారు.
ఇక రాధికా శరత్ కుమార్ కూడా శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉండడంతో ఆమె కూడా ఈ పివి సింధు పార్టీ కి హాజరయ్యారు. చిరు సింధుతో రాధికా దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ.. సింధు బంగారు పతకం గెలుచుకోవడం ఎంత గొప్ప అనుభూతి! దేశం కోసం పోరాడి పతకం సాధించింది సింధు సత్కారంలో పాల్గొనేందుకు గర్వంగా ఫీలవుతున్నట్టుగా ఆమె ట్వీట్ చేసారు. అయితే పివి సింధు ఒలింపిక్స్ లో గెలుచుకున్నది బంగారు పథకం కాదు.. అసలు ఏ పథకమో తెలియకుండానే ఆమె పార్టీకి వెళ్ళారా రాధికా గారు అంటూ నెటిజెన్స్ రాధికని ఆడుకుంటున్నారు.