Advertisementt

ఏదో అనుకుంటే.. ఏదో అయ్యింది

Sat 21st Aug 2021 09:56 AM
payal rajput,payal lands in trouble,complaint filed against payal rajput  ఏదో అనుకుంటే.. ఏదో అయ్యింది
Complaint filed against Payal Rajput ఏదో అనుకుంటే.. ఏదో అయ్యింది
Advertisement
Ads by CJ

RX100 ఫేమ్ పాయల్ రాజ్ ఫుట్ కెరీర్ లో నిలదొక్కుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. బోల్డ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్.. కి తర్వాత అలాంటి పాత్రలే ముప్పు తెచ్చిపెట్టాయి. మంచి కెరీర్ ఉన్న పాయల్ కథల ఎంపికలో లోపమో.. దర్శకనిర్మాతలు పట్టించుకోలేదో కానీ.. ఇప్పుడు చిన్న హీరోలకే పరిమితమైంది. అయితే తాజాగా పాయల్ రాజపుట్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఆమె ఓ షాప్ ఓపెనింగ్ కోసం వెళ్ళింది. రిబ్బన్ కటింగ్ చేస్తే ఆ షాప్ యాజమాన్యం బాగానే ముట్టజెప్పింది. అయితే అసలు సమస్య పాయల్ రాజ్ ఫుట్ ఆ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించలేదంటూ ఆమెపై కేసు నమోదైంది.  

పాయల్ రాజ్‌పుత్ గత నెల 11న పెద్దపల్లిలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి విచ్చేసింది. అక్కడ గ్రాండ్ గా షాప్ యాజమాన్యం షాప్ ఓపెనింగ్  కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే సినీ నటి షాప్ ఓపెనింగ్ చేస్తుంది అంటే.. జనాలు, అభిమానులు ఊరుకోరు కదా.. అందుకే షాప్ ఓపెనింగ్ కి పెద్ద ఎత్తున జన సమూహం పోటెత్తింది. దానితో కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాసం ఉండడంతో.. పాయల్ పై ఆ షాపు యాజమాన్యం పై కూడా కేసు పెట్టారు. అంతేకాకుండా పాయల్ రాజ్ ఫుట్, షాప్ యాజమాన్యం మాస్క్ లు ధరించలేదని ఓ 20 రోజుల క్రితమే  కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తాజాగా కోర్టు ఆదేశాలతో విషయం పబ్లిక్ అయ్యింది.  

Complaint filed against Payal Rajput:

Payal Rajput lands in trouble

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ