Advertisementt

పిక్ టాక్: మెగా వరలక్ష్మి వ్రతం

Fri 20th Aug 2021 07:13 PM
mega family,surekha,upasana konidela,varalakshmi vratham pooja  పిక్ టాక్: మెగా వరలక్ష్మి వ్రతం
Pic Talk: Mega Varalakshmi Vratham పిక్ టాక్: మెగా వరలక్ష్మి వ్రతం
Advertisement
Ads by CJ

ఈ రోజు శ్రావణ శుక్రవారం. వరలక్ష్మి వ్రతం. మహిళలకి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూజ చేసుకుని ట్రేడీషనల్ గా రెడీ అవడమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ రోజున సినిమా పోస్టర్స్, టీజర్స్, సినిమా ఓపెనింగ్స్ అంటూ హడావిడి. ఇక సినిమా సెలబ్రిటీస్ ఇళ్లల్లో వరలక్ష్మి వ్రతం చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టివి సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్ అందరూ వ్రతం చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ గా మారుస్తున్నారు. 

అందులో ముఖ్యంగా మెగా వరలక్ష్మి వ్రతం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. చిరు గారింట్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు ఘనంగా జరిగినట్టుగా మెగా కోడలు అదేనండి.. రామ్ చరణ్ భార్య ఉపాసన తన అత్తగారు సురేఖ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఫొటోస్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఉపాసన, చిరు భార్య సురేఖ కలిసి వరలక్ష్మి దేవి కి వ్రతం చేసుకుని  అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి.. పూజ చేసుకుని.. చిరు తల్లి ఒడిలో పళ్ళు, పక్కనే చిరు మనవరాలు ఉన్న ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ ని ఉపాసన షేర్ చేసింది. 

Pic Talk: Mega Varalakshmi Vratham:

Surekha and Upasana Konidela Varalakshmi Vratham Pooja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ