నిన్నగాక మొన్న గుంటూరులో ఓ ప్రేమ మూర్ఖుడి అరాచకానాయికి రమ్య దారుణ హత్యకి గురయితే.. నిన్న గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారి అఘాయిత్యానికి లోనైంది. ఆంధ్రప్రదేశ్ మహిళలపై అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిండి అని టిడిపి నేత నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఇవాళ విజయనగరం జిల్లా చౌడవాడలో ఉన్మాది పెట్రోల్ పోసి యువతిని తగులబెట్టాడని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో వరుసగా అమానవీయ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని లోకేశ్ మండిపడ్డారు. సీఎం ఇంటికి సమీపంలో ఉన్నవారూ అత్యాచారానికి గురయ్యారని లోకేష్ ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రతలేదని, మహిళలు, అమ్మాయిలు భయం భయంగా బతుకుతున్నారని దుయ్యబట్టారు. లేని ఆ దిశ చట్టం.. రక్షించలేని దిశయాప్ పేరుతో ప్రచారం చేయడం సిగ్గు చేటని లోకేష్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. నిందితుల్ని పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు.