చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకుని మోహన్ రాజా దర్శకత్వంలో చిరు 153 సెట్స్ లో జాయిన్ అయ్యారు. మోహన్ రాజా - చిరు కాంబోలో మలయాళ హిట్ మూవీ లూసిఫర్ ని రీమేక్ చేస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లోని ఓ భారీ సెట్ లో ఈ రీమేక్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టింది టీం. ప్రస్తుతం సినిమాలో కీలకమైన చిరు ఖైదీ గా జైల్లో ఉన్న సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. చిరు ఫుల్ యాక్టీవ్ గా, ఫుల్ స్వింగ్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇక ఆచార్య సాంగ్స్ షూట్ కోసం చిరు 153 కి కాస్త బ్రేక్ వేసి.. ఆచార్య సాంగ్ షూట్ లో పాల్గొంటారు చిరు. ఆచార్య కి సంబందించిన అప్ డేట్ చిరు బర్త్ డే అంటే ఎల్లుండి ఆగష్టు 22 న ఏదో ఒకటి ఉండబోతుంది అని మెగా ఫాన్స్ ఫిక్స్ అవ్వగా.. మోహన్ రాజా - చిరు కాంబో చిరు 153 అప్ డేట్ కూడా రాబోతుంది అంటూ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. మరి చిరు బర్త్ డే కి మెగా ఫాన్స్ ఎన్ని ట్రీట్స్ అందుకుంటారో చూడాలి.