Advertisementt

శేఖర్ మాస్టర్ ఢీ షో మానెయ్యడానికి కారణం

Thu 19th Aug 2021 09:04 PM
shekar master,missing,dhee dance show  శేఖర్ మాస్టర్ ఢీ షో మానెయ్యడానికి కారణం
Reasons behind Sekhar master missing in Dhee Show శేఖర్ మాస్టర్ ఢీ షో మానెయ్యడానికి కారణం
Advertisement
Ads by CJ

కొన్నేళ్లుగా ఢీ డాన్స్ షో కి జడ్జి గా హాజరవుతూ.. మధ్య మధ్యలో కామెడీ చేస్తూ.. ప్రియమణి, పూర్ణ, రష్మిక, వర్షిణిలతో ఆడిపాడిన శేఖర్ మాస్టర్.. ఢీ డాన్స్ షో నుండి హఠాత్తుగా తప్పుకున్నారు. శేఖర్ మాస్టర్ ఢీ నుండి తప్పుకున్నారా? తప్పించారా? అనే దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం స్టార్ మా లో కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా శేఖర్ మాస్టర్ కనిపిస్తున్నారు. అయితే శేఖర్ మాస్టర్ ఢీ నుండి తప్పుకోవడానికి అక్సా ఖాన్ - డాన్సర్ రాజు అంటూ ప్రచారం జరిగింది. అక్సా ఖాన్ శేఖర్ మాస్టర్ పై చేసిన ఆరోపణల వలనే ఇలా శేఖర్ మాస్టర్ ఢీ నుండి బయటికి వచ్చేసారు అని ప్రచారం జరిగింది. 

తాజాగా శేఖర్ మాస్టర్ ని ఢీ నుండి మల్లెమాల టీం కావాలనే తప్పించింది. కారణం ఆయన రూల్స్ బ్రేక్ చేశారట. అంటే ఢీ షో కి జడ్జ్ గా కొనసాగుతూ.. స్టార్ మా లో కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా వెళ్లడంతోనే.. శేఖర్ మాస్టర్ ని మల్లెమాల టీం ఢీ డాన్స్ షో నుండి తప్పించారట. అయితే శేఖర్ మాస్టర్ గనక కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు జడ్జి నుండి బయటికి వచ్చేస్తే.. మళ్ళీ ఆయన్ని ఢీ షో లోకి తీసుకుంటారట. మల్లెమాల టీం చేసిన పనికి శేఖర్ మాస్టర్ కూడా అప్ సెట్ అవడంతోనే.. ఆయన ఢీ డాన్స్ నుండి బయటికి వచ్చినట్టుగా జబర్దస్త్ కమెడియన్ ఒకరు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 

Reasons behind Sekhar master missing in Dhee Show:

Shekar Master Missing In Dhee Dance Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ