చాలామంది సినిమా వారసుల్లాగానే.. మంచు మోహన్ బాబు కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. అందరు వారసుల్లాగా.. స్టార్ హీరోలు కాలేకపోయారు. మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ కెరీర్ లో చెప్పుకోదగిన హిట్స్ ఓ రెండు మూడు తప్ప.. మిగతావన్నీ ప్లాప్ మూవీస్ మాత్రమే. మంచు విష్ణు హీరోగా నిలబడడానికి ఇంకా ఇంకా పోరాడుతున్నాడు. మంచు మనోజ్ కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ హీరో గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే తాజాగా అలి తో సరదాగా షో లో పాల్గొన్న మంచు విష్ణు తనతో సినిమాలు చేసిన డైరెక్టర్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
కొందరి దర్శకుల కారణంగానే తన కెరీర్ ఇలా తయారయ్యింది అని, దర్శకులని గుడ్డిగా నమ్మి మోసపోయానని, వారి వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది అని, ముఖ్యంగా ఆ నాలుగు సినిమాలు వలనే తన కెరీర్ నాశనం అయ్యింది అని, ఆ దర్శకుల కారణంగానే తాను ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చింది అని, సినిమా డిజాస్టర్ బాధ్యతను దర్శకుడు ఒక్కడే మొయ్యాలి అంటూ మంచు విష్ణు తన ప్లాప్ సినిమాల బాధ్యతను దర్శకులపై నెట్టేశారు. మరి మంచు విష్ణు అంత గుడ్డిగా నమ్మేస్తే.. దర్శకులు కేవలం ఆయన్నే అంతగా మోసం చేసేశారా? అసలు కథ ఫైనల్ చేసేటప్పుడు ఆయన తెలివి ఏమైంది అంటూ నెటిజెన్స్ మంచు విష్ణు ని ట్రోల్ చేస్తున్నారు.