Advertisementt

హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రామ్ చరణ్

Thu 19th Aug 2021 01:08 PM
ram charan,jr ntr,rrr movie,star heroes back to hyderabad,rrr ukraine schedule  హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రామ్ చరణ్
Ram Charan landed in Hyderabad హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రామ్ చరణ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - రాజమౌళి - రామ రావు కాంబోలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ప్రస్తుతం ఉక్రెయిన్ షెడ్యూల్ కూడా పూర్తవడంతో స్టార్ హీరోలైన ఎన్టీఆర్ నిన్న హైదరాబాద్ కి చేరుకోగా.. ఈ రోజు రామ్ చరణ్ కూడా హైదరాబాద్ కి రిటర్న్ అయ్యాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తవడంతో ఇకపై డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసి.. మధ్యమధ్యలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ తో పాటుగా వాళ్ళ తదుపరి చిత్రాల షూటింగ్స్ కోసం జంప్ అవుతారు. ఎన్టీఆర్ కొరటాల మూవీకి, రామ్ చరణ్ శంకర్తో చేస్తున్న RC15 సెట్స్ కి వెళ్ళిపోతారు. 

ఇక రామ్ చరణ్ - శంకర్ కాంబోలో సెప్టెంబర్ లో మొదలు కాబోతున్న RC15 లో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించబోతుంది. అలాగే మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పుడు RC15 విలన్ గా మలయాళ క్రేజీ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ నటించే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఉక్రెయిన్ ని తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు.. RC15 ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫాన్స్. 

Ram Charan landed in Hyderabad:

Ram Charan and Jr NTR head back to Hyderabad after RRR Ukraine Schedule

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ