స్టార్ మాలో కార్తీక దీపం సీరియల్ రోజు రోజుకి ట్విస్ట్ లతో బుల్లితెర ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ లో కార్తీక్ మోనిత హత్య కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. వంటలక్క దీప డాక్టర్ బాబు ని రక్షించుకోవడానికి రాత్రనక పగలనక కష్టపడుతుంది. ఇక మోనిత హత్య నాటకంలో భాగంగా కార్తీక్ ని దక్కించుకోవడానికి ఊరవతల పాడుబడిన ఇంట్లో ఉంటుంది. డాక్టర్ మోనిత ఇప్పుడు కొత్త కేరెక్టర్ లో దీపని చంపేసి.. కార్తీక్ ని దక్కించుకోవాలని ఆగ్రహంతో ఊగిపోతుంటుంది. కార్తీక్ తనని హత్య చెయ్యకపోయినా.. తన రివాల్వర్ తో కాల్చుకుని.. కార్తీక్ ని దక్కించుకోవాలని మోనిత ప్లాన్ చేసినట్టుగా ఈ ఎపిసోడ్ లో చూపించారు.
దీపని చంపేందుకు మోనిత బయలు దేరుతుంది. వంటలక్క దీప గుడికి వెళుతున్న విషయాన్నీ కానిస్టేబుల్ మోనితకి చెబుతుంది. మోనిత సోది అమ్మాయి వేషంలో దీప దగ్గరకి బయలు దేరుతుంది. కార్తీక్ తనకి దక్కాలంటే దీపని పైకి పంపాలని కసితో ఉంటుంది మోనిత. ఇక కార్తీక్ బెయిల్ కోసం ఆయన తండ్రి ఉన్నతాధికారులతో మాట్లాడుతాడు. మరి ఈ రోజు జరగపోయే ఎపిసోడ్ లో మోనిత గన్ తో దీప వెళుతున్న గుడికి వెళుతుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూసేద్దాం.