సెకండ్ వేవ్ తర్వాత లవ్ స్టోరీ రిలీజ్ డేట్ కోసం అక్కినేని ఫాన్స్ తెగ వెయిట్ చేసారు. ఇక ఈ రోజు లవ్ స్టోరీ మేకర్స్ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఇచ్చేసి ఫాన్స్ కోరికని తీర్చేసారు. సెప్టెంబర్ 10 న వినాయక చవితి సందర్భంగా లవ్ స్టోరీ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ఓ పోస్టర్ తో సహా ప్రకటించారు. నాగ చైతన్య - సాయి పల్లవి చెయ్యి చెయ్యి పట్టుకుని పరుగు పెడుతున్న పోస్టర్ తో లవ్ స్టోరీ డేట్ ని ప్రకటించారు.
అయితే వినాయక చవితి అంటూ ఇంగ్లీష్ పదాలు ప్రచురించిన టీం.. ఆ వినాయక చవితి ఇంగ్లీష్ లెటర్స్ లో VINAKAYA CHAVITI అంటూ తప్పు లెటర్స్ ప్రచురించడంతో.. ఇప్పడు నెటిజెన్స్ దాని మీద ట్రోలింగ్ మొదలు పెట్టారు. లవ్ స్టోరీ డిజైన్ కి ఇంగ్లీష్ రాదా.. వస్తే.. ఇలానేనా రాసేది అంటూ మండిపడుతున్నారు. ఇక లవ్ స్టోరీ టీం కూడా VINAKAYA CHAVITI రిలీజ్ లవ్ స్టోరీ అంటూ పోస్టర్ ని రిలీజ్ చేసిన నిమిషాల్లోనే ఆ పోస్టర్ లోని VINAKAYA CHAVITI లెటర్స్ సరిచేసి VINAYAKA CHAVITI అంటూ పర్ఫెక్ట్ స్పెల్లింగ్ తో పోస్టర్ రిలీజ్ చేసిన.. నెటిజెన్స్ కి మాత్రం లవ్ స్టోరీ టీం అడ్డంగా దొరికిపోయింది.