దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు కొడుకులు ఈమధ్యన తరుచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నామధ్యన ఎల్లారెడ్డి గుడికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి దాసరి కొడుకులు తనని బెదిరిస్తున్నారు అంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వమంటే.. బెదిరిస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేసారు. తాజాగా దాసరి రెండో కుమారుడు దాసరి అరుణ్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది.
దాసరి నారాయణ రావు దగ్గర పని చేసిన నర్సింహులు అనే వ్యక్తి అరుణ్ పై ఈ కేసు పెట్టారు. దాసరి నారాయణరావు వద్ద కొన్నాళ్ళు నర్సింహులు పనిచేశారు. ఆ పనికి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో వివాదం కొనసాగుతోంది. డబ్బులు ఇస్తామని ఇంటికి పిలిచి కులం పేరుతో దాసరి అరుణ్ తనను దూషించాడని రెండురోజుల ముందు నర్సింహులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. బంజారా హిల్స్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.