గత నెలలో థియేటర్స్ ఓపెన్ అయ్యి.. చిన్న సినిమాల హడావిడి బాక్సాఫీసు దగ్గర కనబడినా.. ఎప్పుడో ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమాల రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ ఇంకా ఆచితూచి ఆలోచిస్తున్నారు. చిరు అండ్ సినిమా సెలబ్రిటీస్ ఏపీ సీఎం జగన్ తో థియేటర్స్ సమస్యలు, టికెట్ రేట్స్ విషయమై చర్చించాలని నిర్ణయించారు. అయితే చిరు అండ్ బ్యాచ్ జగన్ ని కలిసాక.. చైతన్య లవ్ స్టోరీ, చిరు ఆచార్య, బాలయ్య అఖండ మూవీ రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఇక నాగ చైతన్య - శేఖర్ కమ్ముల్ లవ్స్ స్టోరీ ప్రమోషన్స్ కూడా సెకండ్ వేవ్ కి ముందే పూర్తయ్యాయి.
అయితే సెకండ్ వేవ్ తగ్గి థియేటర్స్ ఓపెన్ అవడంతో లవ్ స్టోరీ వచ్చే నెల వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతుండగా.. రేపు అంటే.. ఆగష్టు 18 ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయమే నాగ చైతన్య లవ్ స్టోరీ రిలీజ్ డేట్ రాబోతుంది. సెప్టెంబర్ లో వినాయక చవితి కానుకగా లవ్ స్టోరీ రిలీజ్ చెయ్యడానికి.. ఫిక్స్ అయ్యి.. మేకర్స్ రేపు మంచి టైం లో ఈ డేట్ ని ప్రకటించబోతున్నారు.