కార్తీక దీపం: విలన్ మోనిత ని హత్య చేసినందుకు డాక్టర్ బాబు కార్తీక్ ని ఏసిపి రోషిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో.. కార్తీక్ ని కాపాడుకునేందుకు వంటలక్క దీప రాత్రీపగలు కష్టపడుతుంది. కార్తీక్ ని కాపాడాలనే తాపత్రయంలో ఉన్న దీపకి డ్రైవర్ అంజి ఎదురు పడతాడు. అంజి మోనితని చంపడానికి వెళ్ళినప్పుడే అక్కడ పోలీస్ లు ఉండడంతో.. అంజి వెనక్కి వెళ్లిన విషయం దీపకి చెబుతాడు. అయితే దీపమ్మా మీరు కంగారు పడకండి.. మోనిత ని నేను హత్య చేసినట్టుగా లొంగిపోతాను అంటాడు. దానికి దీప నీ భవిష్యత్తు నాశనం అవుతుంది.. కార్తీక్ బాబు ని ఎలాగోలా కాపాడుకుందాం అంటుంది దీప.
అయితే మోనితకి మనం కాకుండా మరెవరన్నా శత్రువులు ఉన్నారా.. అని అనుకుంటుంటే.. హత్య చెయ్యబడిన మోనిత ఓ విచిత్ర రూపం లో ఎంట్రీ ఇచ్చింది. ఓ పాడుబడిన ఇంట్లో మోనిత ఉంటుంది. కార్తీక్ సెల్ దగ్గర ఉండే కానిస్టేబుల్ మోనిత దగ్గరకు వెళ్ళగానే నా కార్తీక్ ఎలా ఉన్నాడు అంటూ పెద్ద బొట్టు పెట్టుకుని జడవేసుకుని ట్రెడిషనల్ గా కాదు, కాస్త డిఫ్రెంట్ లుక్ లో కనిపిస్తుంది. ఇక కానిస్టేబుల్ ఫోన్ లో కార్తీక్ ఫోటో చూసి ముద్దులు పెట్టుకుంటుంది. మరి మోనిత ఇలా దాక్కుని డాక్టర్ బాబు ని ఎంతవరకు ఇబ్బందులు పెడుతుందో చూద్దాం.