ఏపీలో కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది. నిన్నమొన్నటివరకు రెండు వేలకు పైబడిన కరోనా కేసులు.. ఇప్పుడు వందల్లో నమోదు కావడం కాస్త ఊరట కలిగిస్తుంది. అందుకే ప్రస్తుతం ఏపీలో కర్ఫ్యూని సడలించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. అందరూ మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. థర్డ్‌వేవ్ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అయితే తెల్లవారు జామున జరిగే పెళ్లిళ్లకు ముందస్తుగా అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసారు. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఉంటుందని చెప్పారు.వి వాహ కార్యక్రమాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. కోవిడ్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.