కనడ నుండి క్యూట్ గా టాలీవుడ్ కి ఎంటరైన రష్మిక మందన్న గీత గోవిందం తో కెరీర్ టర్న్ అవ్వడమే కాదు.. స్టార్ హీరోస్ మూవీస్ తో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ మూవీస్ తో రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లోను జెండా పాతడానికి రెడీ అయిన రష్మిక సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన డైలీ పనులని డైరీ రూపంలో బయటపెట్టేస్తుంది.
ఇక ఈ మధ్యన గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రష్మిక మందన్న తాజాగా పూల తలపాగాతో వెరైటీ లుక్స్ తో అదరగొట్టేసింది. అటు పుష్ప సినిమా షూటింగ్, ఇటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ షూటింగ్స్ తో పాటుగా బాలీవుడ్ మూవీ షూట్స్ తో బిజీగా ఉన్న రష్మిక ఇలా ఖాళీగా ఉన్న టైం లో పూల తలపాగా పెట్టుకుంది. పూల గుత్తులతో చేసిన అల్లికను తలిపై పెట్టుకుని వెరైటీ వెరైటీ ఫోజులతో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక తలపాగా లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.