ఈ నెలలో దోస్తీ సాంగ్ తో ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ ఉర్రుతలూగారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా దోస్తీ సాంగ్ లో సందడి చెయ్యడంతో ఇరువురి ఫాన్స్ పండగ చేసుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని.. హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమవుతున్న ఆర్.ఆర్.ఆర్ బృందం.. వచ్చే నెలలో మరో స్వీట్ సర్ ప్రైజ్ ని రెడీ చెయ్యబోతుందట. అక్టోబర్ 13 టార్గెట్ గా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి తగ్గేదెలా అంటున్నారు.
ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చే నెలలో వదలబోయే ఆర్.ఆర్.ఆర్ ప్రోమోలో కొమరం భీం ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ కలయికలో ఓ ప్రోమో కట్ చేయబోతున్నారట. ఆ ప్రోమోలో రామ్ చరణ్ -ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతమైన డైలాగ్స్ తో ఇరువర్గాల అభిమానులకు మంచి కిక్ ఇస్తారని తెలుస్తోంది. ఈ ప్రోమో ప్రమోషన్ లో భాగంగా సినిమాలో ఉండే అతి కీలకమైన డైలాగ్స్ తోనే సినిమాపై అంచనాలు మరింత పెంచాలని ఆర్.ఆర్.ఆర్ టీం రెడీ అవుతుందట.