మామూలుగానే ప్రకాష్ రాజ్ విలనిజాన్ని చూస్తే చిన్న పిల్లలు సైతం భయపడతారు. ప్రకాష్ రాజ్ విలనిజం, ఆయనలోని తండ్రి పాత్ర అన్ని అద్భుతమే. అలాంటి ప్రకాష్ రాజ్ మా ఎన్నికల విషయంలో నిజమైన విలన్ లా తయారయ్యాడు. మెగా సపోర్ట్ తోనే బరిలోకి దిగారనుకున్న ప్రకాష్ రాజ్ కి చిరు చిన్న ఝలక్ ఇచ్చారు. మొన్నటివరకు మా ఎన్నికల విషయంలో సైలెంట్ గా ఉన్న చిరంజీవి.. ఎన్నికలు జరిగితే ఇండస్ట్రీలోని సమస్యల పరిష్కారానికి ముందడుగు వెయ్యొచ్చు.. అంటూ మా కమిటీ మెంబెర్ కృష్ణం రాజుకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక మా ఎన్నికల విషయంలో అందరికన్నా ముందే రంగంలోకి దిగిన ప్రకాష్ రాజ్.. కొన్నాళ్లుగా ట్వీట్స్ తో అందరిని రెచ్చగొడుతున్నారు.
ఇక మంచు విష్ణు బాలకృష్ణ వైపు మాట్లాడుతుంటే.. చిరు ఎవరికి మద్దతునిస్తారో అనే ఆసక్తి అందరిలో ఉంది. తాజాగా చిరు ని ప్రకాష్ రాజ్ జిమ్ లో మీట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు ఉదయాన్నే BOSS ని జిమ్ లో మీట్ అయ్యాను. సినిమా ఇండస్ట్రీలోని సమస్యల పరిష్కరానికి చొరవ తీసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. అందరికి, ఎప్పటికి స్ఫూర్తిదాయకమైన అన్నయ్య అశీసులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని.. Early morning meeting with the BOSS in the gym. Thanked him for taking the initiative to find solutions for the film fraternity .. an ever inspiring ANNAYA.. we are blessed to have him 🤗🤗 అంటూ ప్రకాష్ రాజ్ చిరు తో దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రస్తుతం మా ఎన్నికల మేటర్ హాట్ హాట్ గా ఉన్న సమయంలో ప్రకాష్ రాజ్ ఇలా చిరు ని మీట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది.