పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ హడావిడి ముగియకముందే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబో హరి హర వీరమల్లు మూవీ హడావిడి మొదలవ్వబోతుందా? అదే అంటున్నారు పవన్ ఫాన్స్. హరి హర వీరమల్లు అప్ డేట్ సూన్ అంటూ తెగ హడావిడి చేస్తూ హరిహర వీర మల్లుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ రోజు క్రిష్ హరి హర వీర మల్లు అప్ డేట్ ఇవ్వబోతున్నారంటూ ఫాన్స్ హంగామా చూస్తే నిజంగానే హరిహర వీరమల్లు అప్ డేట్ వచ్చేస్తుంది అనే అనుకుంటారు.
#HariHaraVeeraMallu update soon అంటూ పవన్ ఫాన్స్ ట్విట్టర్ లో పవన్ సినిమా ని ట్రెండ్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పిరియాడికల్ డ్రామా హరి హరవీరమల్లు సంక్రాంతి కి విడుదల అన్నప్పటికీ.. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా వేసవికి షిఫ్ట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం క్రిష్ అండ్ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ వేసవి అని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. పవన్ గజ దొంగగా నటిస్తుంటే.. బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ యువరాణిగా మెరవబోతుంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు రెస్యూమ్ షూట్ ఈ రోజా రేపో మొదలు కాబోతున్నట్టుగా సమాచారం.