Advertisementt

రజిని అంకుల్ కూడా సాల్వ్ చేయలేకపోయారు

Mon 16th Aug 2021 10:31 PM
actress vanitha vijayakumar,vanitha vijayakumar emotional words,vanitha vijayakumar news  రజిని అంకుల్ కూడా సాల్వ్ చేయలేకపోయారు
Even Rajini's uncle could not solve it రజిని అంకుల్ కూడా సాల్వ్ చేయలేకపోయారు
Advertisement
Ads by CJ

తమిళనాట మాత్రమే కాదు.. తెలుగులోనూ నటుడు విజయ్ కుమార్ అంటే తెలియని వారుండరు. విజయ్ కుమార్ నటి మంజుల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. అలాగే ఆయన కూతుళ్లు వనితా, శ్రీదేవి, రుక్మిణి లు కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అయితే విజయ్ కుమార్ పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్ కాంట్రవర్సీ క్వీన్. ఆమె పెళ్లిళ్ల విషయంలోనే కాదు.. విజయ్ కుమార్ తో ప్రాపర్టీ విషయంలోనూ బాగా హైలెట్ అయ్యింది. వనిత విజయ్ కుమార్ ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుని పేరెంట్స్ నుండి విడిపోయి బయటికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యిపోయింది. 

తర్వాత తల్లి మంజుల మరణం తర్వాత వనిత విజయ్ కుమార్ తన ఫ్యామిలీ మీదకి ప్రాపర్టీ విషయంలో చేసిన ఫైట్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. తాజాగా వనిత విజయ్ కుమార్ అలీ తో సరదాగా ప్రోగ్రాం లో తాను తన ఫ్యామిలీని ప్రాపర్టీ విషయంలో ఎందుకు గొడవ పడాల్సి వచ్చిందో.. ఈ విషయమై సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా విజయ్ కుమార్ తో మాట్లాడినట్లుగా వనిత అలీ ప్రోగ్రాం లో చెప్పుకొచ్చింది. తాను డివోర్స్ తీసుకుని, పిల్లలతో నిలువనీడ లేని టైం లో నా వాటా అడిగాను అని, సూపర్ స్టార్ రజినీకాంత్ తనకి చాలా క్లోజ్ అని, అంకుల్ అంటామని, మా నాన్నగారికి రజిని అంకుల్ క్లోజ్ అని, అమ్మ అంటే రజిని అంకుల్ కి ఇష్టమని, రజిని అంకుల్ కూడా నాకు రావాల్సిన వాటా విషయమై నాన్నగారితో మాట్లాడినా .. పని జరగలేదని.. దానితో తాను కూడా ఈ ప్రాపర్టీ విషయం లైట్ తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది వనిత విజయ్ కుమార్. 

Even Rajini's uncle could not solve it:

Actress Vanitha Vijayakumar Emotional Words about Her mother

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ