Advertisementt

బాలయ్య స్పందన కోసం వెయిటింగ్

Mon 16th Aug 2021 09:31 PM
chiranjeevi,balakrishna,ap cm,jagan,cm jagan,nagarjuna,cinema industry,celebrities  బాలయ్య స్పందన కోసం వెయిటింగ్
Waiting for a Balakrishna response బాలయ్య స్పందన కోసం వెయిటింగ్
Advertisement
Ads by CJ

ఆంధ్ర లో టికెట్ రేట్స్, నైట్ కర్ఫ్యూలతో థియేటర్స్ క్లోజ్ విషయాలను ఏపీ సీఎం జగన్ తో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు సినిమా ఇండస్ట్రీ పెద్దలయిన చిరంజీవి, నాగార్జున, రాజమౌళి ఇంకా కొరటాల లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఏపీలో టికెట్ రేట్స్ విషయం తెగితే.. మీడియం, పెద్ద భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఎదురు చూస్తున్నారు. అందుకే చిరు ఆధ్వర్యంలో సినిమా ప్రముఖులు ఏపీ జగన్ ని కలిసేందుకు, ఈ విషయాలను ఎలా చర్చించాలి అని మాట్లాడుకునేందుకు చిరు ఇంట్లో మీట్ అయ్యారు. అయితే గత ఏడాది కరోనా లాక్ డౌన్ టైం లో థియేటర్స్ ఓపెన్ చెయ్యడం, సినిమా షూటింగ్స్ మొదలు పెట్టేందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకునే టైం లో చిరు బ్యాక్ నందమూరి బాలకృష్ణ ని పక్కన పెట్టడంతో.. బాలయ్య అలిగారు. అవకాశం వచ్చినప్పుడు బాలయ్య చిరు పై సెటైర్స్ కూడా వేశారు. 

మరి తాజాగా ఏపీ జగన్ ని మీట్ అయ్యే క్రమంలోను నందమూరి బాలకృష్ణ కి పిలుపు రాలేదో.. పిలిచినా వెళ్ళలేదో కానీ.. ఇప్పుడు ఈ చిరు ఇంట్లో సినిమా ప్రముఖులు భేటీపై నందమూరి బాలయ్య స్పందనపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ ఇంకా సినీ ప్రముఖులకి అపాంట్మెంట్ ఇవ్వలేదు. ఈలోపు బాలయ్య లైన్ లోకి వచ్చి ఏమైనా కామెంట్స్ చేస్తారా.. లేదంటే వాళ్ళు వెళ్లొచ్చాక ఈ విషయమై మాట్లాడతారా అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా , క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. 

Waiting for a Balakrishna response:

Celebrities meet Chiru ahead of his meet with CM Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ