Advertisementt

మోహన్ బాబు అంతగా మోసం చేసింది ఎవరో?

Mon 16th Aug 2021 07:28 PM
mohan babu,sensational comments,chandrababu naidu  మోహన్ బాబు అంతగా మోసం చేసింది ఎవరో?
Who cheated so much on Mohan Babu? మోహన్ బాబు అంతగా మోసం చేసింది ఎవరో?
Advertisement
Ads by CJ

ఒకప్పుడు మోహన్ బాబు కి చంద్రబాబు అంటే ఎంతిష్టమో చెప్పక్కర్లేదు. మోహన్ బాబు ఫ్యామిలీ చంద్రబాబు తో మంచి అనుబంధం మెయింటింగ్ చేసేది. అలాంటి మోహన్ బాబు జగన్ సీఎం అవ్వకముందు నుండే.. చంద్రబాబు నాయుడిపై ఫైర్ అవడం, చంద్రబాబు నాయుడు తనని మోసం చేశాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత మంచు మోహన్ బాబు బిజెపికి దగ్గరయినా.. కాలక్రమేణా.. జగన్ వైసిపి కి దగ్గరయ్యారు. అయితే తనని చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడంటూ మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

చంద్రబాబు నాయుడుకి సంబందించిన హెరిటెజ్‌కంపెనీ లో తాను పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి భాగస్వామిగా 19 ఏళ్ళ క్రితం చేరానన్నారు. ఆ తర్వాత చంద్రబాబు తనను దారుణంగా మోసం చేశారని.. ఇప్పుడు హెరిటేజ్‌లో ఓ పార్ట్‌నర్‌గా ఉండాల్సిన నన్ను అవమానకర రీతిలో బయటకు పంపించి వేసారని.. చంద్రబాబు తనను మోసం చేసిన విషయాన్ని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి దగ్గర ప్రస్తావించానన్నారు. 

అప్పుడు ఎప్పుడో జరిగిన మేటర్ ని తాజాగా మోహన్ బాబు ఇలా బయటపెట్టారు. అంతేకాకుండా అన్న ఎన్టీఆర్ గారు నన్ను రాజ్యసభకు నామినేట్ చేస్తే.. చంద్రబాబు తనను ఎందుకు పనికి రానని పక్కనపెట్టేసిన చంద్రబాబు పై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా మోహన్ బాబు ఈ ఇంటర్వ్యూలో నేను దర్శకుడిని అయితే.. షూటింగ్ విషయంలో సమయపాలన పాటించని వాళ్లపై చేయి చేసుకుంటాను.. అందుకే మెగాఫోన్‌కు దూరంగా ఉన్నానన్నారు. 

Who cheated so much on Mohan Babu?:

Mohan babu Sensational comments on Chandrababu naidu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ