Advertisementt

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్

Mon 16th Aug 2021 01:44 PM
nara lokesh,tdp leader lokesh,lokesh arrest,nara lokesh arrested in guntur  బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్
Breaking: Nara Lokesh arrested in Guntur బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్
Advertisement
Ads by CJ

నిన్న గుంటూరు కాకాని రోడ్డులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థిని రమ్యను ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. రమ్య హత్య ఏపీ వ్యాప్తంగా కలకలం రేపింది. రమ్య హత్య తో గుంటూరు అట్టుడుకుతోంది. పలువురు పొలిటికల్ లీడర్స్ రమ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈ రోజు రమ్య  కుటుంబాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ ఈరోజు పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు. 

లోకేష్ రమ్య కుటుంబాన్ని కలిసిన సందర్భంగా అక్కడకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అనంతరం పలువరు టీడీపీ నేతలను, నారా లోకేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

లోకేష్ ను అక్రమంగా అరెస్టు చేయడం, మాజీమంత్రి నక్కా ఆనందబాబుపై స్వయంగా ఎస్పీ చేయి చేసుకోవడం దారుణమంటూ టిడిపి నేతలు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఫైర్ అవుతున్నారు. దళిత ఆడబిడ్డకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులపై వైసీపీ గుండాలను ఉసిగొల్పడం,శాంతిభద్రతల పేరుతో అక్రమంగా అరెస్టులు చేయడం ప్రభుత్వ దమన నీతికి నిదర్శనమన్నారు. 

Breaking: Nara Lokesh arrested in Guntur:

TDP Leader Nara Lokesh Arrest

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ