Advertisementt

రావణ్ ని విష్ చేసిన ఆదిపురుష్ రాముడు

Mon 16th Aug 2021 12:41 PM
prabhas,pan india star prabhas,adipurush co-star,saif ali khan,saif ali khan birthday  రావణ్ ని విష్ చేసిన ఆదిపురుష్ రాముడు
Prabhas wishes Adipurush villain Saif Ali Khan రావణ్ ని విష్ చేసిన ఆదిపురుష్ రాముడు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆదిపురుష్ అనే 3D ప్రాజెక్ట్ నిర్మిస్తుంది.. ఆదిపురుష్ టీం చకచకా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది. రాముడిగా ప్రభాస్ ఆదిపురుష్ లో కనిపిస్తుంటే.. సీత గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో రాముడిని ఢీ కొట్టబోయే రావణ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ టీం ముంబై లోని ఓ సెట్ లో రావణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు. 

అయితే ఆదిపురుష్ మొదలై కొన్ని నెలలు గడుస్తుండడంతో.. ఆదిపురుష్ లుక్ పై ప్రభాస్ ఫాన్స్ లోనే కాదు.. బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఆదిపురుష్ రాముడి లుక్ ని దసరా కానీ.. దివాళి సందర్భంగా కానీ రిలీజ్ చేసే యోచనలో టీం ఉన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఆదిపురుష్ రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే నేడు. సైఫ్ రావణ్ లుక్ ని ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన బర్త్ డే రోజున ఆదిపురుష్ టీం ఎలాంటి హడావిడి చెయ్యలేదు. మరి ఆదిపురుష్ రాముడు ఆదిపురుష్ రావణ్ కి బర్త్ డే విషెస్ తెలియజెయ్యడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ కి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Prabhas wishes Adipurush villain Saif Ali Khan:

Prabhas wishes Adipurush co-star Saif Ali Khan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ