Advertisementt

ఫస్ట్ ప్రోమోతోనే రామ్ - భీం హీటెక్కించారు

Sun 15th Aug 2021 06:38 PM
jr.ntr,evaru meelo koteeswarudu show,evaru meelo koteeswarudu show new promo,ram charan  ఫస్ట్ ప్రోమోతోనే రామ్ - భీం హీటెక్కించారు
Evaru Meelo Koteeswarudu Ram charan and NTR promo ఫస్ట్ ప్రోమోతోనే రామ్ - భీం హీటెక్కించారు
Advertisement
Ads by CJ

ఎప్పుడెప్పుడు బుల్లితెర మీద ఎన్టీఆర్ షో చూసెయ్యాలా అనే ఆతృతలో ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటుగా బుల్లితెర ప్రేక్షకులు ఉన్నారు. ఈ నెల 22 నుండే ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదలు కాబోతుంది. ఇప్పటివరకు ప్రోమోస్ తోనే షో పై హైప్ క్రియేట్ చేసిన జెమినీ ఛానల్ ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫస్ట్ గెస్ట్ అంటే కర్టెన్ రైజెర్ ఎపిసోడ్ కి రామరాజు అదేనండి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడం, షో లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ని ఆటపట్టించడం, ఎన్టీఆర్ ని ఉడికించడం, ఎన్టీఆర్ ప్రశ్నలతో రామ్ చరణ్ కి చమట్లు పట్టించడం.. అబ్బో రామ్ - భీం ఎపిసోడ్ మాములుగా లేదు.

జస్ట్ ప్రోమో తోనే షో పై బాగా హైప్ క్రియేట్ చేసేసారు. రామ్ చరణ్ షో కి ఎంట్రీ ఇచ్చి.. హోస్ట్ సీట్ లో కూర్చోబోగా.. వెంటనే ఎన్టీఆర్ అడ్డుపడి, అది హాట్‌ సీటు‌.. ఇది హోస్ట్‌ సీటు అని చెప్పడంతో రామ్ చరణ్ వెళ్లి హాట్‌ సీటులో కూర్చుని.. చరణ్ ఎన్టీఆర్ ని రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టి ఆట పట్టించగా.. చివరకి సీటు హీట్‌ ఎక్కుతోంది.. బ్రెయిన్‌ హీట్‌ ఎక్కుతోంది అంటూ రామ్ చరణ్ చేసిన హడావిడి, ఎన్టీఆర్ సూపర్ లుక్ అన్ని ప్రోమో కి హైలెట్ గా నిలిచాయి. 

ఆర్.ఆర్.ఆర్ తో సిల్వర్ స్క్రీన్ మీద రామ్ - భీం లు ఎలా ఉంటారో కానీ.. బుల్లితెర మీద మాత్రం ఈ రామ్ - భీం లు అల్లరి ఎవరు మీలో కోటీశ్వరులకు సూపర్ హిట్.. ఈ సమయం మెగా ఫాన్స్ - ఎన్టీఆర్ ఫాన్స్ కలిసి పండగ చేసుకునే టైం అన్నమాట. 

Evaru Meelo Koteeswarudu Ram charan and NTR promo:

Jr.NTR Meelo Evaru Koteeswarudu New Promo With Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ