Advertisementt

బోర్‌డమ్‌కు గుడ్‌బై - బిగ్ బాస్ కి వెల్ కం

Sat 14th Aug 2021 08:11 PM
bigg boss,bigg boss telugu season 5,bigg boss telugu,bigg boss promo,nagarjuna  బోర్‌డమ్‌కు గుడ్‌బై - బిగ్ బాస్ కి వెల్ కం
Bigg Boss Telugu Season 5 Promo Released బోర్‌డమ్‌కు గుడ్‌బై - బిగ్ బాస్ కి వెల్ కం
Advertisement
Ads by CJ

గత నాలుగు సీజన్స్ నుండి బుల్లితెర ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల చివరిలో అయినా వచ్చే నెల మొదటి వారంలో అయినా బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కాబోతుంది. స్టార్ మా బిగ్ బాస్ లోగోని రిలీజ్ చేసి షో పై అంచనాలు పెంచేసింది. తాజాగా నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కాబోతుంది అంటూ ఓ ప్రోమో ని రిలీజ్ చేసింది. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ పై వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ.. నాగార్జునే సీజన్ 5 హోస్ట్ అని.. దానికి సంబందించిన ప్రోమో ని రిలీజ్ చేసింది. 

బిగ్ బాస్ సీజన్ 5 కి నాగ్ హోస్ట్ గా ఆయన ఎంట్రీ అదుర్స్ అనేలా ఉంది. చెప్పండి బోర్‌ డమ్‌కు గుడ్‌బై.. వచ్చేస్తోంది బిగ్‌బాస్‌ సీజన్‌-5 డైలాగ్ కి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం స్టార్ మా రిలీజ్ చేసిన బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో ట్రేండింగ్ లో ఉంది. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ విషయంలో ఇప్పుడు అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ఇక బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు మొదలు కాబోతుందో ఇంకా డేట్ ఇవ్వలేదు. 

Bigg Boss Telugu Season 5 Promo Released:

Bigg Boss Telugu Season 5 Promo 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ