Advertisementt

ముఖ్య‌మంత్రి నుంచి మెగాస్టార్ కి ఆహ్వానం

Sat 14th Aug 2021 07:57 PM
megastar,jagan,megastar chiru,chief minister jagan,invitation to megastar from ap chief minister jagan  ముఖ్య‌మంత్రి నుంచి మెగాస్టార్ కి ఆహ్వానం
Invitation from Chief Minister to Megastar ముఖ్య‌మంత్రి నుంచి మెగాస్టార్ కి ఆహ్వానం
Advertisement
Ads by CJ

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నుంచి మెగాస్టార్ కి ఆహ్వానం

క‌రోనా వేవ్ తగ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైనా ఏపీలో టిక్కెట్టు ధ‌ర స‌మ‌స్యాత్మ‌కం అయిన సంగ‌తి తెలిసిందే. స‌వ‌రించిన ధ‌ర‌ల‌తో ఎగ్జిబిష‌న్, పంపిణీ రంగాలు చిక్కుల్లో ప‌డ్డాయి. థియేట‌ర్ల స‌మ‌స్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు. సీఎం జ‌గ‌న్ తో భేటీ కోసం సినీపెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఏపీ మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్  చిరంజీవికి  శనివారం రోజు ఫోన్ చేసి, సినీపెద్ద‌ల‌తో క‌లిసి వ‌చ్చి ప్రస్తుత స‌మ‌స్య వివరిచ్చాల్సిదిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి  తరపున మంత్రి పేర్ని నాని  ఆహ్వానించారు. 

ఈ కీల‌క భేటీలో ప్ర‌స్తుతం ఉన్న థియేట‌ర్ల స‌మ‌స్య గురించి.. ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల బ‌తుకు తెరువు స‌హా.. పంపిణీ వ‌ర్గాల వేతనాల గురించి మాట్లాడే అవ‌కాశం ఉంది. చిరంజీవితో పాటు సినీ పరిశ్రమకు చెందిన  కొంద‌రు హాజరు కానున్నారు. ఇంత‌కుముందు సీఎంతో భేటీ లో చిరంజీవి- నాగార్జున - రాజ‌మౌళి- సురేష్ బాబు బృందం స‌మ‌స్య‌లు విన్న‌వించగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే, అలాగే గతంలో పరిశ్రమ కు అనుకూలంగా  సియం జగన్ ఎప్పుడు వరాలు ఇచ్చినా, చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన సందర్భాలున్నాయి.. ఇప్పుడు ఈ భేటీ ఈ నెల చివరి వారంలో జరగనుంది, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈసారి స‌మ‌స్య‌కు త‌క్ష‌ణ పరిష్కారం చూపిస్తార‌నే అంతా ఆకాంక్షిస్తున్నారు. 

Invitation from Chief Minister to Megastar:

Invitation to Megastar from AP Chief Minister Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ