Advertisementt

పవన్ అండ్ రానా టైటిల్ వచ్చేస్తుంది

Fri 13th Aug 2021 06:32 PM
pawan kalyan,rana film,pawan - rana combo,pawan - rana title,first glimpse,agust 15th  పవన్ అండ్ రానా టైటిల్ వచ్చేస్తుంది
Pawan, Rana Power Storm on August 15th పవన్ అండ్ రానా టైటిల్ వచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కుతున్న మలయాళ హిట్ ఫిలిం అయ్యప్పన్ కోషియం మూవీ రీమేక్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. పవన్ - రాణాలపై యాక్షన్ సీక్వెన్సెస్ ని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సాగర్ కె చంద్ర. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా భీమ్లా నాయక్ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దాదాపుగా ఈ సినిమాకి భీమ్లా నాయక్ అనే టైటిల్ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు పవన్ - రానా కాంబో మూవీ టైటిల్ రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారు.

ఆగస్టు 15 ఉదయం 9.45 గంటలకు పవన్ - రానా కాంబో టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనుంది. ఆగస్టు 15న పవర్ తుపాను రాబోతుంది అంటూ మూవీ టీం ప్రకటించడంతో పవన్ ఫాన్స్ ఆగడం లేదు. ఈ ఏడాది వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ మళ్ళీ అయ్యప్పన్ కోషియం రీమేక్ తో ప్రేక్షకుల ముందు రావడానికి 2022 సంక్రాంతికి రెడీ అవుతున్నారు. మరి ఆగష్టు 15 ఎవరు ఎలాంటి అప్ డేట్ ఇచ్చినా పవన్ ఫాన్స్ కి ఈ అప్ డేట్ మాత్రం సరిపోతుంది అంతే.

Pawan, Rana Power Storm on August 15th:

Pawan-Rana film title and first glimpse on

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ