Advertisementt

గోవాకి రెడీ అవుతున్న సూప‌ర్‌స్టార్

Fri 13th Aug 2021 06:07 PM
superstar mahesh babu,sarkaru vaari paata movie,sarkaru vaari paata goa schedule begins  గోవాకి రెడీ అవుతున్న సూప‌ర్‌స్టార్
Mahesh Babu Sarkaru Vaari Paata Goa Schedule Begins గోవాకి రెడీ అవుతున్న సూప‌ర్‌స్టార్
Advertisement
Ads by CJ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు లేటెస్ట్ మూవీ స‌ర్కారువారి పాట‌. ఈ చిత్రం నుంచి స్పెష‌ల్ డే..మ‌హేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లైన బ్లాస్టర్ కు అత్య‌ద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ బ్లాస్టర్ లో మ‌హేశ్ చాలా స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. త‌న యాట్యిట్యూడ్‌, డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. అన్ని అంశాల‌తో ఓ ఎంట‌ర్‌టైనింగ్ రోల్‌లో, మ‌హేశ్‌ను ఎలివేట్ చేసిన తీరు చూసి డైరెక్ట‌ర్ ప‌ర‌శురాంను ప్రేక్ష‌కాభిమానులు అప్రిషియేట్ చేశారు.

రీసెంట్‌గా స‌ర్కారువారి పాట‌ హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్త‌య్యింది. శుక్ర‌వారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మైంది. ఓ భారీ సెట్ వేసి ఫైట్ మాస్ట‌ర్స్‌ రామ్ ల‌క్ష్మ‌ణ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్ర‌క‌రిస్తున్నారు. దీంతో పాటు కొంత టాకీ పార్టును కూడా చిత్రీక‌రిస్తారు. ఈ గోవా షెడ్యూల్‌లో ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి గోవా షెడ్యూల్‌ వ‌ర్కింగ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో మ‌హేశ్‌, ప‌ర‌శురాం, రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ నెక్స్ట్ తీయబోయే సీన్ గురించి డిస్క‌స్ చేసుకుంటున్నారు.

స‌ర్కారువారి పాట‌ను ప‌ర్‌ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై  న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఆర్‌.మ‌ది సినిమాటోగ్రాఫ‌ర్‌. మార్తాండ్ కె.వెంక‌టేశ్ ఎడిట‌ర్‌, ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతి స్పెష‌ల్‌గా జ‌న‌వ‌రి 13న సినిమాను విడుద‌లచేస్తున్నారు.

Mahesh Babu Sarkaru Vaari Paata Goa Schedule Begins:

Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Goa Schedule Begins

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ