Advertisementt

దుమ్మురేపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Fri 13th Aug 2021 12:22 PM
pushpa movie,pushpa pan india film,pushpa first single,daakko daakko meka song released  దుమ్మురేపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Pushpa first single Daakko Daakko Meka shows power దుమ్మురేపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పుష్ప. ఆగస్టు 13 ఉదయం 11:07 నిమిషాలకు 5 భాషల్లో పుష్ప-ది రైజ్ తొలి సింగిల్ విడుదలైంది. పాట విడుదలైన మరుక్షణం నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేకోవర్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. నోటిలో కత్తి పెట్టుకొని ఐకాన్ స్టార్ చేసిన డాన్స్ లకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. క్రిస్మస్ సందర్భంగా పుష్ప- ది రైజ్ విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

పాట లిరిక్స్..

తందానే.. తాన తందానానేనా.. (2)

తానాని తనినరీనానే..

అ.. అ.. అ.. అఅఅ..

వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక..

మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి..

అ.. అ.. అ.. అఅఅ..

పులినే తింటది చావు.. చావును తింటది కాలం..

కాలాన్ని తింటది ఖాళీ.. ఇది మహా ఆకలి..

అ.. అ.. అ.. అఅఅ..

వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి..

దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది..

ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే..

హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..

చాపకు పురుగు ఎరా.. పిట్టకు నూకలు ఎరా..

కుక్కకు మాంసం ముక్క ఎరా.. మనుషులందరికీ బతుకే ఎరా..

గంగమ్మ తల్లి జాతర.. కోళ్లు పొట్టేళ్ళు కోతరా..

కత్తికి నెత్తుటి పూతర.. దేవతకైనా తప్పదు ఎరా..

ఇది లోకం తలరాతరా..

అ.. అ.. అ.. అఅఅ..

ఏమరపాటుగా ఉన్నావా.. ఎరకే చిక్కేస్తావు..

ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు..

కాలే కడుపు సూడదురో నీతి న్యాయం..

బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం..

హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..

అడిగితే పుట్టదు అరువు.. బతిమాలితే బతుకే బరువు..

కొట్టర ఉండదు కరువు.. దేవుడికైనా దెబ్బే గురువు..

తన్నులు సేసే మేలు.. తమ్ముడు కూడా సెయ్యడు..

గుద్దుడు సెప్పే పాఠం.. బుద్ధుడు కూడా సెప్పడహే..

Pushpa first single Daakko Daakko Meka shows power:

Pushpa first single Daakko Daakko Meka released 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement