Advertisementt

అస్సలు ఊపిరాడనివ్వని చిరు.. ఫాన్స్ కి పండగే

Fri 13th Aug 2021 12:17 PM
chiranjeevi,chiru 153,megastar chiru,mohan raja,lucifer remake,thaman,chiru lucifer  అస్సలు ఊపిరాడనివ్వని చిరు.. ఫాన్స్ కి పండగే
Chiranjeevi Lucifer Telugu remake shoot begins అస్సలు ఊపిరాడనివ్వని చిరు.. ఫాన్స్ కి పండగే
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు బర్త్ డే వేడుకలు ఎప్పుడో మొదలైపోయాయి. మరో పది రోజుల్లో మెగాస్టార్ పుట్టిన రోజు కోసం మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుండో మెగాస్టార్ బర్త్ డే వేడుకల కోసం ఏర్పాట్లు మొదలు పెట్టిన మెగాస్టార్ చిరు ఫాన్స్.. ఇప్పడు ఆయన నటిస్తున్న చిత్రాలతో మరింత హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు. అంటే చిరు ఆచార్య షూటింగ్ అలా ఫినిష్ అయ్యిందో లేదో.. ఇలా చిరు లూసిఫెర్ రీమేక్ షూటింగ్ సెట్స్ లో వాలిపోయారు. చిరు - రామ్ చరణ్ కాంబో ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకుంది. సాంగ్స్ రెండు బ్యాలెన్స్ ఉన్న ఆచార్య మూవీ ని అటుంచి.. ఇటు మోహన్ రాజా దర్శకత్వంలో చిరు లూసిఫర్ మొదలు పెట్టారు. 

థమన్ మ్యూజిక్ అందిస్తున్న లూసిఫర్ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో మొదలైంది. పూజా కార్యక్రమాలతో మొదలైన లూసిఫర్ షూటింగ్ నేడు రెగ్యుల్ షూటింగ్ మొదలు పెట్టుకుంది. ఈ రోజు హైదరాబాద్ లో సురేశ్ సెల్వ రాజన్ వేసిన ప్రత్యేకమైన సెట్లో మొదలైంది. చిరు పై యాక్షన్ సన్నివేశాలతో మోహన్ రాజాగా లూసిఫెర్ రీమేక్ షూట్ ని మొదలు పెట్టారు. మెగా ఫాన్స్ ఎప్పుడుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైం రావడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. అటు ఆచార్య ని ఫినిష్ చేసిన చిరు గ్యాప్ లేకుండా లూసిఫర్ రీమేక్ సెట్స్ లో వాలిపోవడం ఫాన్స్ మరింతగా సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇప్పటికే థమన్ ఓ సాంగ్ కి మ్యూజిక్ పూర్తి చెయ్యగా.. ఈ సినిమాకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 

Chiranjeevi Lucifer Telugu remake shoot begins:

Chiranjeevi 153 shoot begins

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ