జూన్ లో భారీ అంచనాల నడుమ అమెజాన్ ప్రైమ్ నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 పాన్ ఇండియా వెబ్ సీరీస్ గా తెరకెక్కుతుంది.. అందుకే సమంత ఈ వెబ్ సీరీస్ లో నటిచించింది అనుకుంటే.. ఫ్యామిలీ మ్యాన్ 2 కేవలం హిందీ లో మాత్రమే అందుబాటిలోకి వచ్చింది కానీ.. ఇతర భాషల్లో ఇంతవరకు ఫ్యామిలీ మ్యాన్ ని రిలీజ్ చెయ్యలేదు మేకర్స్. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ రిలీజ్ అయినప్పటినుండి తెలుగులో చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సమంత పెరఫార్మెన్స్, ఆమె లుక్స్ అన్ని ఫ్యామిలీ మ్యాన్ 2 పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేసాయి. అందులోనూ ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ మొదటిది తెలుగులో అందుబాటులోకి వచ్చి హిట్ అవడంతో ప్రేక్షకులు సీజన్ 2 కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
అయితే అదిగో ఇదిగో అంటూ ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ మ్యాన్ 2 త్వరలోనే తెలుగులో అందుబాటిలోకి రానున్నదని సమాచారం. అది కూడా ఈనెలలోనే ఫ్యామిలీ మ్యాన్ 2 ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు కానీ.. ఈ నెలలోనే ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్ 2 ని తెలుగులో అందుబాటులోకి తేబోతున్నారని మాత్రం తెలుస్తుంది.