బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే హౌస్ మేట్స్ అందరూ ఓ 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. కారణం ఏం లేదు ఒక్కటే.. కరోనా. కరోనా టెస్ట్ లు చేయించుకుని ఆ తర్వాత ఓ 15 రోజులు క్వారంటైన్ లో ఉంది హౌస్ లోకి అడుగుపెట్టి మళ్ళీ సేఫ్ గా హౌస్ నుండి బయటికొచ్చేలా అన్ని జాగ్రత్తలతో బిగ్ బాస్ టీం గత ఏడాది సీజన్ నిర్వహించింది. ఈ ఏడాది సీజన్ 5 కూడా అదే జరగబోతుంది.
అయితే బిగ్ బాస్ టెక్నీకల్ టీం మాత్రం గత సీజన్ లో తమ తమ పని పూర్తికాగానే ఇంటికెళ్లిపోతుండేవారు. బిగ్ బాస్ కెమెరామెన్ లు, ఎడిటర్లు బయటకు వెళ్ళి వచ్చేవారు. అయితే ఈసారి వాళ్లను కూడా బిగ్ హౌస్ దగ్గర్లోనే.. షో పూర్తయ్యేవరకు ఉంచేలా ఏర్పాట్లు చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి షో మొదలైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటి నుంచి లోపలి వారికి సంబంధాలు లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇందులో నిజమెంత అనేది బిగ్ బాస్ సీజన 5 మొదలైతే గని క్లారిటీ రాదు.. ఈనెలాఖరు కానీ, సెప్టెంబర్ 5 న కానీ సీజన్ 5 మొదలు కాబోతుంది.