Advertisementt

అల్లు అర్జున్ పుష్ప నుండి దాక్కో దాక్కో మేక..

Thu 12th Aug 2021 08:00 PM
pushpa,allu arjun pushpa,pushpa song,dakko dakko meka song,  అల్లు అర్జున్ పుష్ప నుండి దాక్కో దాక్కో మేక..
Allu Arjun Pushpa first single Dakko Dakko Meka will be released అల్లు అర్జున్ పుష్ప నుండి దాక్కో దాక్కో మేక..
Advertisement
Ads by CJ

ఆగస్టు 13న ఐదు భాషల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ దాక్కో దాక్కో మేక విడుదల.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పుష్ప. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదలవుతుంది. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పటికే సంచలన సృష్టించింది. ఈ పాటకు సంబంధించిన కొన్ని ప్రీ టీజర్స్ కూడా ఇప్పటికే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వీటికి సైతం మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేకోవర్ ఈ పాటలో హైలైట్‌గా నిలవనుంది.

ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటలు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు.

టెక్నికల్ టీం: దర్శకుడు: సుకుమార్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా, సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే, సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, లిరిసిస్ట్: చంద్రబోస్, క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్, మేకప్: నాని భారతి, CEO: చెర్రీ, కో డైరెక్టర్: విష్ణు, లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం, బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా, పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మాడూరి మ‌ధు.

Allu Arjun Pushpa first single Dakko Dakko Meka will be released :

Allu Arjun Pushpa Single Song August 13th released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ