యంగ్ హీరోల మూవీస్ లో నటిస్తున్నా లావణ్య త్రిపాఠికి కాలం కలిసిరాక ఒక్క బ్లాక్ బస్టర్ హిట్టు తగలడం లేదు. ట్రెడిషనల్ నుండి.. గ్లామర్ లుక్ లోకి ఎంటర్ అయినా.. లావణ్య త్రిపాఠికి కలిసిరావడం లేదు. ప్రస్తుతం చేతిలో పెద్దగా ఆఫర్స్ లేని లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో గ్లామర్ గా హడావిడీ చేస్తున్న లావణ్య త్రిపాఠికి ఓ అరుదైన వ్యాధి ఉందట. ఆ విషయాన్నీ లావణ్య త్రిపాఠినే స్వయంగా అభిమానులతో ముచ్చటించింది.
తనకి ట్రిపోఫోబియా ఉంది అని, ఆ వ్యాధి వలన కొన్ని వస్తువులు కానీ, ఆకారాలు కానీ చూసినప్పుడు తనకి తెలియకుండానే చాలా భయం కలుగుతుంది అని, ఆ వ్యాధి, ఆ సమస్య నుండి బయటపడేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక తాను కాంక్రీట్ జంగిల్ కు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నానని.. లాక్ డౌన్ లో ఇంట్లోనే వింటూ ఆన్ లైన్ లో కథలు వింటున్నట్టుగా చెప్పుకొచ్చింది లావణ్య. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటే... లైఫ్ కూడా హ్యాపీ గా ఉంటుంది అంటూ అభిమానులకి సలహా పడేసింది లావణ్య.