Advertisementt

అఖిల్ ఏజెంట్ లో అదే హైలెట్

Thu 12th Aug 2021 06:11 PM
akhil,agent movie,akhil agent movie,agent akhil look,akhil agent action scene highlights  అఖిల్ ఏజెంట్ లో అదే హైలెట్
Akhil Agent action scene to give goosebumps అఖిల్ ఏజెంట్ లో అదే హైలెట్
Advertisement
Ads by CJ

ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్నాడు అఖిల్ అక్కినేని. అఖిల్ నటించిన మూడు సినిమాలు సో సో గా ఆడడంతో.. అఖిల్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీద అలాగే ఆయన రీసెంట్ మూవీ ఏజెంట్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ రీసెంట్ గానే సెట్స్ మీదకెళ్లింది. ఏజెంట్ మూవీ షూటింగ్ నెల్లూరులోని కృష్ణపట్నం పోర్ట్ లో మొదలు పెట్టినా.. అక్కడ భారీ వర్షాలకు కొన్ని రోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఏజెంట్ లో ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్సెస్ ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. ఏజెంట్ గా, స్పై గా అఖిల్ మాస్ లుక్ లో కొత్తగా మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ లుక్ తో అదరగొట్టేస్తున్నాడు.

హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఏజెంట్ మూవీ లో ఏజెంట్ మూవీలో ఓ ఛేజింగ్ సీన్ ఉంటుందట. ఇది నిజంగానే హాలీవుడ్ చిత్రాల రేంజ్‌లో షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్ ఏజెంట్ సినిమాకే హైలెట్ గా ఉండబోతుంది అని, ఈ ఫైట్ సీన్ దాదాపుగా ఓ పదిహేను నిమిషాల పాటు ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ యాక్షన్ సీన్ కోసం ఏజెంట్ టీం విదేశాలకు వెళ్ళబోతున్నారు.. అక్కడ హాలీవుడ్ టెక్నీషియన్ల సహాయంతో ఈ ఫైట్ సీన్ ని చిత్రీకరిస్తారని తెలుస్తుంది.

Akhil Agent action scene to give goosebumps:

Akhil Agent action scene highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ