Advertisementt

విజయ్ బీస్ట్ సెట్స్ లో టాప్ క్రికెటర్ ధోని

Thu 12th Aug 2021 04:32 PM
m.s dhoni,crickter dhoni,thalapathy vijay,chennai,beast sets  విజయ్ బీస్ట్ సెట్స్ లో టాప్ క్రికెటర్ ధోని
MS Dhoni visits Vijay on Beast sets విజయ్ బీస్ట్ సెట్స్ లో టాప్ క్రికెటర్ ధోని
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గ్లామర్ హీరోయిన్ పూజ హెగ్డే ఫస్ట్ టైం విజయ్ సరసన నటిస్తుంది ప్రస్తుతం చెన్నై లోని గోకులం స్టూడియో లోని స్పెషల్ సెట్ లో బీస్ట్ మూవీ చిత్రీకరణ చేపట్టారు. అయితే మొన్న బీస్ట్ సెట్స్ కి మరో కోలీవుడ్ హీరో కార్తీ వచ్చి విజయ్ తో సందడి చెయ్యగా.. ఇప్పుడు టాప్ క్రికెటర్ ఎం ఎస్ ధోని విజయ్ బీస్ట్ సెట్స్ లో సందడి చేసారు మరి మామూలుగానే సెలెబ్రిటీస్ ఓ చోట కలిస్తే ఫాన్స్ కి కిక్కిస్తుంది. ఇప్పుడు స్టార్ హీరో, స్టార్ క్రికెటర్ ఒకే చోట కనబడితే ఫాన్స్ ఆగుతారా..

విజయ్ బీస్ట్ సెట్స్ కి వచ్చిన ధోని ని విజయ్ సాదరంగా ఆహ్వానించి.. బీస్ట్ సెట్స్ అంతా తీపి చూపించిన ఫొటోస్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ధోని కూడా చెన్నై గోకులం స్టూడియోస్ లోనే కొన్ని రోజులుగా ఓ యాడ్ షూట్ లో పాల్గొంటున్నారు. అందుకే అక్కడే షూటింగ్ జరుపుకుంటున్న బీస్ట్ సెట్స్ కి వెళ్లి విజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు. ప్రస్తతం విజయ్ అండ్ ధోని కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

MS Dhoni visits Vijay on Beast sets:

M.S Dhoni meets Thalapathy Vijay in Chennai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ