Advertisementt

పుష్ప కి టైం ఫిక్స్ చేసిన టీం

Thu 12th Aug 2021 12:13 PM
allu arjun,pushpa movie,allu arjun psuhpa movie,pushpa pan india film  పుష్ప కి టైం ఫిక్స్ చేసిన టీం
Pushpa first single time locked పుష్ప కి టైం ఫిక్స్ చేసిన టీం
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఆగష్టు 13 పుష్ప రిలీజ్ అంటూ అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం జనవరిలో సోషల్ మీడియాలో గ్రాండ్ గా ప్రకటించారు. ఆ తర్వాత పుష్ప ని ఆగష్టు 13 కి తీసుకురావడానికి గాను సుకుమార్ అండ్ అల్లు అర్జున్ చాలా కష్టపడినా.. సెకండ్ వేవ్ బాగా దెబ్బేసింది. అయితే ఆగష్టు 13 నుండి క్రిష్టమస్ కి రిలీజ్ డేట్ మార్చుకున్న పుష్ప. ఇప్పడూ అదే ఆగష్టు 13 నుండి పుష్ప ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. పుష్ప నుండి ఫస్ట్ సింగిల్ వదులుతుంది. దానికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

దేవిశ్రీ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ని ఐదు భాషల్లో ఐదుగురు గాయకులు పాడుతున్నారు. దాక్కో దాక్కో మేక ప్రోమోలో కత్తిని నోట్లో పెట్టుకుని బన్నీ చేసిన డ్యాన్సు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇప్పుడు ఆ సాంగ్ ని రేపు ఉదయం ఎన్నిగంటలు రిలీజ్ చేయబోతున్నారో టైం కూడా లాక్ చేసింది టీం. ఉదయం 11.07 నిమిషాలకి పుష్ప ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. రష్మిక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి భర్య గా నటించినట్లుగా తెలుస్తుంది. పల్లెటూరి అమ్మాయిగా, డీ గ్లామర్ లుక్ లో రష్మిక కనిపిస్తుండగా. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కాస్త డిఫ్రెంట్ గా కనిపిస్తున్నాడు.

Pushpa first single time locked:

Allu Arjun Pushpa First Single Daakko Daakko Meka song on August 13th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ