బాలకృష్ణ అఖండ షూటింగ్ చివరి దశలో ఉంది. రేపో మాపో.. అఖండ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు దర్శకుడు బోయపాటి రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం తమిళనాడులోని చారిత్రాత్మక గుళ్ళలో అఖండ క్లైమాక్స్ షూట్ ని చిత్రీకరిస్తున్నారు. అయితే బాలకృష్ణ అఖండ షూటింగ్ పూర్తి కాగానే.. గోపీచంద్ మలినేని తో మాస్ మూవీ చెయ్యబోతున్నారు. ఇప్పటికే కథా చర్చలు పార్టీ కాగా.. గోపీచంద్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్నాడు. గోపీచంద్ మలినేని బాలయ్య సినిమా కోసం పవర్ ఫుల్ పాత్ర కోసం కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ని తీసున్నట్లుగా ప్రకటించారు. పక్కా మాస కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
అయితే తాజాగా బాలకృష్ణ తో ఈ సినిమాలో తలపడేందుకు ఓ పవర్ ఫుల్ విలన్ ని గోపీచంద్ తీసుకురాబోతున్నట్లుగా తెలిసిందే. అంటే బాలయ్య తో ఢీ కొట్టబోయే నటుడిని తమినాడు నుండి తీసుకురాబోతున్నారట. కోలీవుడ్ లో విలక్షణ నటుడుగా పలు భాష సినిమాలతో బిజీ గా ఉంటున్న విజయ్ సేతుపతి బాలకృష్ణ తో తలపడబోయే పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్. కొన్నాళ్లుగా విజయ్ సేతుపతి స్టార్ హీరోలకు విలన్ గా అదరగొట్టేస్తున్నాడు. హీరోగానూ, విలన్ గాను, కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను అదరగొట్టేస్తున్న విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ గా బాగా సెట్ అవుతున్నాడు. మరి నిజంగా బాలయ్య సినిమా కోసం విజయ్ సేతుపతి వస్తే NBK107 సినిమాపై అంచనాలు లెక్కలెయ్యడం చాలా కష్టం.