Advertisementt

డెవిల్ ఈజ్ బ్యాక్

Wed 11th Aug 2021 07:03 PM
the devil is back,prakash raj,tweet,successful surgery  డెవిల్ ఈజ్ బ్యాక్
The Devil is Back డెవిల్ ఈజ్ బ్యాక్
Advertisement
Ads by CJ

నిన్న ప్రకాష్ రాజ్ కి ధనుష్ మూవీ సెట్స్ లో షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది అని, ఆయనకి తీవ్ర గాయాలైనట్టుగా వార్తలొచ్చాయి. ప్రకాష్ రాజ్ కి షూటింగ్ స్పాట్ లో ఆక్సిడెంట్ అయినట్లుగా తెలిసి ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ, కన్నడ మూవీస్ బాగా బిజీగా ఉన్న నటుడు. అంతేకాకుండా మా ఎలక్షన్స్ విషయంలోనూ ప్రకాష్ రాజ్ చురుగ్గా పాల్గొంటున్నారు. మా అధ్యక్ష పీఠానికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఇంకా ఎన్నికలకి సమయం ఉండడంతో.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నాడు. అయితే చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కి గాయాలవడంతో ఆయన తన ఫ్రెండ్ డాక్టర్ ఆధ్వర్యంలో చికిత్స కోసం హైదరాబాద్ కి వచ్చినట్టుగా, పెద్దగా గాయాలేమి అవ్వలేదని ట్వీట్ చెయ్యడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తనకి పెద్దగా ప్రమాదం లేదని, ఆందోళన చెందవద్దని, తన ఫ్రెండ్ చేసే ఆపరేషన్ కోసమే తాను హైదరాబాద్ వస్తున్నట్టుగా ప్రకాష్ రాజ్ చెప్పారు. తాజాగా తన భుజానికి ఆపరేషన్ పూర్తయ్యింది అని, ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని, త్వరలోనే మళ్లీ షూటింగ్స్ సెట్స్ లోకి వచ్చేస్తానని ద డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేసాడు. ఇక పిక్ తో పాటుగా ఆయన ఈ ట్వీట్ చెయ్యడంతో ప్రకాష్ రాజ్ భుజానికి సర్జరీ చేసినట్లుగా ఆ పిక్ లో తెలుస్తుంది.

The Devil is Back:

The devil is back: Prakash Raj tweet after successful surgery

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ