ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ లిస్ట్ లో క్రేజీ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 3D లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ ని టి సీరీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ఆదిపురుష్ సెకండ్ షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రధారి గా కనిపిస్తున్న ఈ సినిమాలో సీత గా కృతి సనన్ నటిస్తుంది.అయితే ఈ రోజు ఉదయం నుండే ఆదిపురుష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం ఆదిపురుష్ ని మళ్ళీ ఇదే రోజు అంటే.. 2022 ఆగష్టు 11 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఓం రౌత్ ప్రకటించడంతో ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ రిలీజ్ డేట్ మళ్లీ ఇదే రోజు అంటూ ట్రెండ్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు.
మల్టిప్లెక్స్ లేదు, బీసీ సెంటర్స్ లేదు.. అమలాపురం నుంచి ఆహ్మదాబాద్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు, ఒంగోలు నుంచి ఓవర్సీస్ వరకు అంతా ప్రభాస్ నామస్మరణే... ఆదిపురుష్ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రబస్ ఈసారి దుమ్మురేపటం ఖాయమంటున్నారు ఫాన్స్. వాల్మికి రచించిన రామాయణం కథా నేపథ్యంగా ఆదిపురుష్ తెరకెక్కుతున్నది. దేశంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మళ్ళీ ఈ రోజు ఆదిపురుష్ ప్రభంజనం థియేటర్స్ లో ఉంటుంది అని, బాక్సాఫీసు సునామీని ఎవ్వరూ ఆపలేరని, ప్రభాస్ ప్రభంజనంతో బాక్సాఫీసు విధ్వంశమే అంటూ ఆదిపురుష్ పై ట్వీట్ చేస్తూ ట్రేండింగ్ లో ఉంచారు.