కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈమధ్యన ఓ కారు విషయంలో బాగా హైలెట్ అయ్యాడు. విదేశాల నుండి లగ్జరీ కారుని ఇండియాకి దిగుమతి చేసుకుని ఇక్కడ ఎంట్రీ టాక్స్ చెల్లించకుండా.. ఎంట్రీ టాక్స్ లో మినహాయింపు ఇవ్వాలంటూ విజయ్ కోర్టులో పిటిషన్ వెయ్యగా చెన్నై కోర్టు స్టార్స్ అయ్యుండి ఇలా మినహాయింపులు అడగడం ఏం బాలేదంటూ మొట్టికాయలు వేసి.. ఎంట్రీ టాక్స్ మొత్తం చెల్లించాల్సిందే అంటూ తీర్పు చెప్పింది. 2012 లో విజయ్ రోల్స్ రాయిస్ కారు దిగుమతి చేసుకుని దిగుమతి సుంకాన్ని ఓ 8 లక్షలు కట్టేసి విజయ్ మిగతాది మినహాయింపు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసాడు. అసలైతే ఇలాంటి లగ్జరీ కార్లు దిగుమతి చేసుకుంటే.. 40 లక్షల ఎంట్రీ ఫీ చెల్లించాలి. కానీ విజయ్ కేవలం 8 లక్షలు కట్టాడు.
అయితే కోర్టు తీర్పుతో విజయ్ లైన్ లో కొచ్చి మిగతా 32 లక్షల దిగుమతి సుంకాన్ని చెల్లించినట్టుగా సమాచారం. కారు దిగుమతి చేసుకున్న వారానికి ఫుల్ గా ఎంట్రీ టాక్స్ చెల్లించాల్సిన విజయ్ ఇప్పుడు కోర్టు జోక్యంతో ఇన్నేళ్లకి 40 లక్షల రూపాయల వరకు ఎంట్రీ టాక్స్ చెల్లించాడు. దానితో విజయ్ ఫాన్స్ కాస్త ఫీలయినా.. విజయ్ యాంటీ ఫాన్స్ మాత్రం కోర్టు జోక్యంతో విజయ్ లైన్ లోకి వచ్చాడని అంటున్నారు.