Advertisementt

మొన్న భర్త.. ఇప్పుడు తల్లి కూడా.: పాపం శిల్పా

Tue 10th Aug 2021 12:13 PM
shilpa shetty,mother sunanda,booked for cheating case  మొన్న భర్త.. ఇప్పుడు తల్లి కూడా.: పాపం శిల్పా
Shilpa Shetty and her mom booked in fraud case మొన్న భర్త.. ఇప్పుడు తల్లి కూడా.: పాపం శిల్పా
Advertisement
Ads by CJ

ముంబై నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యి ముంబై పోలీస్ కష్టడీలో ఉన్నారు. దానితో శిల్ప శెట్టి ఆర్ధికంగానూ, అటు వ్యక్తిగతంగా బాగా నష్టపోయింది. పరువు పోతుంది మీడియాని కంట్రోల్ చెయ్యమని కోర్టు కెక్కింది. ఇక రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అవడం, ఇప్పుడు ఆ కేస్ కాకుండా రాజ్ కుంద్రాపై మరిన్ని కేసులు నమోదు అవడం, పలువురు నటీమణులు రాజ్ కుంద్రాపై కేసులు పెట్టడంతో శిల్ప శెట్టి బాగా నలిగిపోతుంది. భర్త అరెస్ట్ తోనే కుంగిపోయిన శిల్ప శెట్టి కి మరో షాక్ తగిలింది. అది కన్నతల్లి కూడా అరెస్ట్ అయ్యేలా ఉండడం, అలాగే ఆ కేసులోనే శిల్ప శెట్టి ని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలొస్తున్నాయి. 

వెల్‌నెస్ సెంటర్ పేరుతో మోసం చేసిన విషయంలో శిల్పా శెట్టి మరియు ఆమె తల్లి సునందలపై చీటింగ్ కేసు నమోదయ్యింది ఈ మోసం కేసులో శిల్పా పేరు ఉన్నందున మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. శిల్ప శెట్టి ని ఆమె తల్లిని విచారించడానికి లక్నో పోలీసుల బృందం ముంబైకి రాబోతుంది. శిల్పా శెట్టి ఎప్పటినుండో ఐయోసిస్ వెల్నెస్ పేరుతో ఫిట్నెస్ చైన్ నడుపుతున్నారు. అయితే ఈ కంపెనీకి శిల్పా శెట్టి నాయకత్వం వహిస్తుండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్ గా ఉన్నారు. వెల్‌నెస్ సెంటర్ బ్రాంచ్ ప్రారంభించే పేరుతో శిల్పా శెట్టి మరియు ఆమె తల్లి ఇద్దరు వ్యక్తుల నుండి కోట్లాది రూపాయలు తీసుకున్నారని.. ఇప్పుడు మోసం చేసారంటూ సదరు వ్యక్తులు కేసు పెట్టడంతో.. ఏ కేసులో ఆశిల్ప తో పాటుగా ఆమె తల్లి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Shilpa Shetty and her mom booked in fraud case:

Shilpa Shetty mother booked for cheating case 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ